calender_icon.png 11 August, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫాయి కార్మికులకు ఒక పూట పని విధానాన్ని అమలు చేయాలి

11-08-2025 07:29:30 PM

వరంగల్ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(Greater Warangal Municipal Corporation) పరిధిలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు ఒక పూట పని విధానాన్ని అమలు చేయాలని బయోమెట్రిక్ హాజరును రోజుకు రెండుసార్లు నమోదు చేసే విధానాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జేఏసీ, ఏ.ఐ.టీ.యూ.సీ, ఐఎన్టీయూసీ, టీఎంఈడబ్ల్యూఏ తదితర సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘ నాయకులు సోమవారం కమిషనర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. పై సమస్యలపై స్పందించిన కమిషనర్ ప్రతినెల 5వ తేదీలోపు వేతనాలు అందేలా చూస్తామని కార్మిక సంఘాలు నాయకులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశామని కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు బోట్ల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు భాస్కర్, గౌరవ అధ్యక్షులు ఏల్పుల ధర్మరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి యాదవ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు పాశం రవి యాదవ్, బొక్క ఏలియా, దామెర రాజు తదితరులు పాల్గొన్నారు.