calender_icon.png 12 August, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమర్థవంతంగా నేర నియంత్రణ విధులు నిర్వహించాలి

11-08-2025 10:39:48 PM

మహిళా పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశంలో ఎస్పీ..

నల్గొండ క్రైమ్: నేర నియత్రణలో మహిళా పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్(District SP Sharath Chandra Pawar) అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా మహిళా పోలీసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న డ్యూటీలు, వారికి ఎదురయ్యే సమస్యలు, పురుష సిబ్బందితో సమానంగా విధులు నిర్వర్తిస్తే ఎదురయ్యే సమస్యలు, కుటుంబ తరుపున సమస్యలపై అడిగి తెలుసుకుని షీ లేడీస్ నల్గొండ- బెలిఎవెస్ అనే నినాదంతో నూతన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

మహిళ సిబ్బంది పోలీస్ స్టేషన్ లలో రిసెప్షన్, రికార్డు వర్క్, టెక్ టీమ్, ఇతర పోలీస్ స్టేషన్ లో విధులతో పాటు బయట డ్యూటీ లు కమ్యూనిటీ పోలిసింగ్ ప్రోగ్రాం, బ్లూ క్లోట్స్, నైట్ పెట్రోలింగ్, పిటిషన్ ఎంక్వయిరీ, కోర్ట్ డ్యూటీ, సమాన్స్, మెడికల్ డ్యూటీ, వెహికల్ చెకింగ్, క్రైమ్ డ్యూటీ లు, ఎస్కార్ట్ డ్యూటీ, ట్రాఫిక్ డ్యూటీ లు, బందోబస్త్ డ్యూటీ లు మెన్ తో సమానంగా విధులు నిర్వహించాలని సూచించారు. మహిళా సిబ్బంది కి సెల్ఫ్ డిఫెన్స్ పైన  శిక్షణ ఏర్పాటు చేయాలి అని అధికారులకు సూచించారు. ఈ సమావేశం ASP మౌనిక , అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్.బి సీఐ రాము,  కరుణాకర్,  సంతోష్, తదితరులు పాల్గొన్నారు.