11-08-2025 10:32:00 PM
యాచారం: మూడేండ్లకే చిన్నారి ఆయుష్షు తీరింది, మృత్యుపాశమైన ట్రాక్టర్ మూడేళ్ల చిన్నారిని కబళించింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన వన్నాడవు అవంతిక(3)ను గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.