calender_icon.png 12 August, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల ఆరోగ్యానికి రక్షణగా అల్బెండజోల్ మాత్రలు

11-08-2025 10:37:00 PM

మెడికల్ ఆఫీసర్ శివకాంత్..

మిడ్జిల్: 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లల్లో నులిపురుగు సమస్య నివారణకు, ఆహార జీర్ణక్రియ మెరుగుదలకు శారీరక వికాసానికి అల్బెండజోల్ మాత్రలు ఉపయోగపడతాయని వారు తెలిపారు. మిడ్జిల్ ఆగస్టు 11 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్లను మెడికల్ ఆఫీసర్ శివకాంత్, బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి ఆల్వాల్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లల్లో నులిపురుగుల సమస్య నివారణకు ఆహార జీర్ణక్రియ మెరుగుదలకు శారీరక వికాసానికి ఈ మాత్రలు ఉపయోగపడతాయని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య జెడ్పిహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు సరస్వతి, డాక్టర్ శశాంక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అయస్కాన్ సూపర్వైజర్ ప్రసాద్ సునంద, వైద్య సిబ్బంది సంపత్, జంగయ్య, దేవయ్య రాజేశ్వరి, మాజీ ఎంపిటిసి మహమ్మద్ గౌస్ నాయకులు వెంకటయ్య పర్వతాలు ఉస్మాన్ నరేందర్ రెడ్డి, అయా గ్రామాల ప్రధానోపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.