11-08-2025 10:50:53 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్(MLA Madan Mohan Rao) మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల 5 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బస్ స్టాండ్‌ను నిర్మించి ప్రజల వినియోగానికి అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్, నియోజకవర్గంలో ప్రజా రవాణా సౌకర్యాలను విస్తరించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడుతూ, బస్సుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ వినతిని మంత్రి వెంటనే స్పందించి, బాన్సువాడ, కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసి, ఎల్లారెడ్డికి 10 అదనపు కొత్త బస్సులను కేటాయించారు. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గానికి 10 కొత్త బస్సులు రానున్నాయి. మూడు దశాబ్దాల క్రితం డిపో నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో బస్ డిపో ఏర్పాటు ఎల్లారెడ్డి ప్రజల ఎన్నో ఏళ్ల కల. అవసరమైన అన్ని అనుమతులు సిద్ధంగా ఉండగా, సోమవారం ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతిపత్రం అందజేయగా, సానుకూలంగా స్పందించారు. TGSRTC ఎండికి ఎల్లారెడ్డిలో బస్ డిపో నిర్మాణంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దానితో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.