28-04-2025 08:53:19 PM
చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ 6.32 అంగుళాల డిస్ప్లే స్క్రీన్ మరియు డ్యూయల్ కెమెరాతో వన్‌ప్లస్ 13ఎస్ (OnePlus 13s) గల మరో సరికొత్త ఫోన్ విడుదల చేయనుంది. తాజా క్వాల్ కామ్ లెటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) ప్రాసెసర్ తో ఈ పోన్ లాంచ్ కానుంది. OnePlus 13s కోసం వేచి ఉన్న కస్టమర్ల కోసం కంపెని వెబ్‌సైట్ లో కమింగ్ సూన్ అని పేర్కంది. గతవారం చైనాలో వన్‌ప్లస్ 13టీ నే విడుదల చేసింది. ఇక్కడ వన్‌ప్లస్ 13ఎస్ గా తీసుకురానున్నట్లు సమాచారం.
వన్‌ప్లస్ 13ఎస్ ఫీచర్లు:
డిస్ప్లే 6.32-అంగుళాల 1.5K 8T ఎల్టీపీఓ అమోలేడ్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు సిరామిక్ గార్డుతో వస్తుంది.
ఫోన్ బరువు దాదాపు 185 గ్రాములు, 8.15mm మందం కలిగి ఉంటుంది.
క్వాల్ కామ్ లెటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ హై-స్పీడ్ ప్రాసెసర్‌తో పాటు, అడ్రినో 830 జీపీయూ ఉంది.
12/16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 నిల్వ ఉంటుంది.
అంతేకాదు అలర్ట్ స్లయిడర్ స్థానంలో కొత్తగా షార్ట్ కీని ఈ ఫోన్ లో వన్‌ప్లస్ ప్రవేశపెట్టింది.
కెమెరా పరంగా ఒఐఎస్ తో 50mp సోనీ IMX906 ప్రైమరీ షూటర్, ఒఐఎస్ కి 50mp 2x టెలిఫోటో లెన్స్‌తో సహా డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు కెమెరా 16-మెగాపిక్సెల్, 30fpsతో 1080p వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు.
ఇది IP65 యొక్క నీరు మరియు ధూళి నిరోధకతతో పాటు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
ధర: భారతదేశంలో ధరలు ఇంకా విడుదల కానప్పటికీ, చైనాలో, OnePlus 13Tకి సంబంధించి 12 GB+256 GB వేరియంట్ ధర 3,399 యువాన్లుగా నిర్ణయించారు. భారతదేశం కరెన్సీ ప్రకారం సుమారు రూ.39,636 ఉంటుంది.