29-11-2025 01:05:49 AM
గజ్వేల్ క్లస్టర్లో జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదేశాలు
సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:28గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లాలో పర్యవేక్షిస్తున్న కలెక్టర్ కె.హైమావతి శుక్రవారం గజ్వేల్, ములుగు మండలాల్లో పర్యటించారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ క్లస్టర్లో నామినేషన్ స్వీకరణను పరిశీలించిన కలెక్టర్ సాయంత్రం 5 గంటల లోపు లైన్లో ఉన్నవారి పత్రాలనే స్వీకరించాలని, నామినీ వివరాలు పూర్తిగా చెక్ చేసిన తర్వాతే స్లిప్ ఇవ్వాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు.
క్లస్టర్ చుట్టూ వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంచి, అభ్యర్థితో ఇద్దరినే అనుమతించాలని పోలీసులకు సూచించారు.ములుగు మండలం వంటిమామిడి శివారులో ఎస్‌ఎస్టీ శిబిరం తనిఖీ చేసిన కలెక్టర్, 96 వాహనాలు పరిశీలించినట్లు సిబ్బంది వివరించారు. ప్రతి వాహనాన్ని 24/7 తనిఖీ చేసి ప్రక్రియ మొత్తం వీడియోలో రికార్డు చేయాలని సూచించారు. తరువాత చిన్న తిమ్మాపూర్ క్లస్టర్ను కూడా పరిశీలించిన కలెక్టర్, హెల్ప్డెస్క్ లో ఫారం వివరాలు స్పష్టంగా అభ్యర్థులకు తెలియజేయాలని, నామినేషన్ల వివరాలను రోజూ టీ-పోల్ లో అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.