29-11-2025 01:05:04 AM
సీఐ శివ శంకర్
నారాయణపేట, నవంబర్ 28 (విజయక్రాంతి) : ఆటో డ్రైవర్లు ట్రాఫికీ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను, విద్యార్థులను, కూలీలను ఎక్కించుకోరాదని, వాహ నాలకు సంబంధించిన పత్రాలను కల్గి ఉండాలని సీఐ శివ శంకర్ తెలిపారు. పెరపళ్ళ నుండి నారాయణపేట టౌన్‌కి వస్తున ఆటోలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విద్యార్థులను, ప్రయాణికులను పరిమితికి మించి తీసుకెళ్తు ఆటోను ప్రమాదకరంగా నడుపుతున్న ఆటో డ్రైవర్ను సిఐ శివ శంకర్, ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య, రూరల్ ఎస్‌ఐ రాముడు లు పట్టుకొని పోలీసు స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు.
ఆటో డ్రైవర్ లైసెన్స్ లేకుండా, పరిమితి కంటే ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకొని రోడ్డుపై నిర్లక్ష్యంగా నడుపుతున్నట్టు గుర్తించారు. విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే ఈ రకమైన నిర్లక్ష్యాన్ని అస్సలు సహించబోమని సిఐ అన్నారు. ఇలాంటి ప్రమాదకర చర్యలు భవిష్యత్తులో పునరావృతం చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు వారి తల్లితండ్రులు ఆటోలలో పరిమితికి మించి పంపారాదు అని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు.