07-05-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, మే 6 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల తో శాంతి చర్చలు జరిపి మోహరించిన కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కోరింది.
బట్టు రామచంద్రయ్య అద్యక్షతన మంగళవారం నాడు జరిగిన సభలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్ జనార్ధన్, సిపిఐ ఎంఎల్ రాష్ర్ట కమిటీ సభ్యులు కె ఉప్పలయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు కాశపాక మహేష్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అంతం చేస్తామని ఆపరేషన్ కగార్ పేరుతో మధ్య భారతం దండ కారణ్యంలో లక్షలాది మంది సైనిక బలగాలతో వైమానిక దాడులకు పాల్పడుతు న్నదని ఆరోపించారు.
మావోయిస్టుల పేరు తో అమాయక ప్రజలైన ఆదివాసీ గిరిజనులను పట్టుకోని కాల్చి చంపుతూ నిత్యం రక్తపుటేరులు పారిస్తూ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దేశాలతో పారిశ్రామిక ఒప్పందాలు చేసుకొని ఇక్కడ ఖనిజ సంపదను పెట్టుబడిదారీ దేశాలకు దోచి పెడుతూ ఈ దేశ పౌరులపై యుద్ధాన్ని ప్రకటించి కగార్ పేరుతో హత్యాకాండ కోనసాగిస్తుందనీ మరోవైపు ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఆదివాసీ హక్కులకోసం ఖనిజ సంపదను కాపాడాలని కోరుతూ ప్రజాస్వామ్య బద్ధంగా బయట సమాజంలోని ప్రజలు ప్రజాస్వామికవాదులు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులనుండి వస్తున్న ప్రశ్నను నిరసనను కూడా ప్రభుత్వం.
ఉద్దేశపూర్వకంగానే అర్బన్ నక్సల్ అనే ముద్ర వేసి ఉపా కేసులు పెట్టి జైల్లలో బంధిస్తుంది ఇలా అన్నివిధాలా ప్రజలపై రకరకాలుగా దాడులకు పాల్పడ్డతూ ఇప్పుడు తన దోపిడీ పాలనను మరింత తీవ్రతరం చేస్తూ రాజ్యాంగ బద్దం గా నడుచుకోవాల్సిన ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా చంపేస్తాం అంతం చేస్తా మని మాట్లాడటం దుర్మార్గమైన చర్య అవుతుందని ఒక వైపు మావోయిస్టులు చర్చల కు సిద్ధం అని ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా ఇంకా దాడులకు పాల్పడి చంపడం చేయడం సిగ్గుచేటని.
ఈ విషయమై ప్రజలు ప్రజాస్వామికవాదులు రచయితలు మేధావులు వ్యతిరేకిస్తు న్నారని కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ బద్దంగా అలోచించి ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి దండకారణ్యంలో మోహరించిన సైనిక బలగాలను వెనక్కి తీసుకోని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదే సందర్భంలో రాష్ర్ట ప్రభుత్వం తమ జాతీయ పార్టీ నాయకులతో మాట్లాడి తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ ఎన్‌డిఆర్ జిల్లా కార్యదర్శి పంగ రవి, విరసం సభ్యులు పి చిన్నయ్య, డిటిఎఫ్ జిల్లా అద్యక్షులు మైలారం సత్తయ్య, పిఎంసి అద్యక్షులు సిరిపంగ శివలింగం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు శీలం స్వామి,
ఎంఆర్‌పిఎస్ రాష్ర్ట సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, ఎఐకేఎంఎస్ మామిడాల బిక్షపతి, సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాల్ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నర్సింహా పాల్గొన్నారు.