07-05-2025 12:00:00 AM
ములుగు, మే 6 (విజయ కాంతి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన కాకతీయుల కాలంనాటి కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం, కోటగుళ్ళ ను మంగళవారం పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ సందర్శించారు.త్వరలో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్న తరుణంలో అధికారుల బృందం సందర్శించి ఆలయ పరిసరాలను, శిల్పాలను పరిశీలించారు.
గర్భాలయం ప్రదక్షిణ పదం, కోటేశ్వరాలయం, నాట్యమండపాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శిలా శాసనం, నందీశ్వరుడు, ద్వారపాలక విగ్రహాలను పరిశీలించి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్కియాలజిస్ట్ అసిస్టెంట్ రోహిణి, సీనియర్ కన్వర్జేటర్ మల్లేశం ఉన్నారు.