calender_icon.png 29 December, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకోవాలి

29-12-2025 01:12:47 AM

పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి

దిగ్విజయ్‌కి శశిథరూర్ మద్దతు

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : బీజేపీ ఉన్న సంస్థాగత బలాన్ని ప్రశంసి స్తూ.. కాంగ్రెస్ శక్తివంతం కావాల్సిన ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే దిగ్విజయ్ వ్యాఖ్యలకు ఆ పార్టీకి చెంది న మరో నేత శశిథరూర్ మద్దతు పలికారు. కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో థరూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయ డం గమనార్హం. దిగ్విజయ్ వ్యాఖ్యలను విలేకర్లు ప్రస్తావించగా తమ సంస్థ బలోపేతం కావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు థరూర్ తెలిపారు.

దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదని అన్నా రు. ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ అవసరమన్నారు. ‘నేడు పార్టీకి చాలా ముఖ్యమైన రోజు. మనకు 140 ఏళ్ల చరిత్ర ఉంది. దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు’ అని అన్నారు. శనివారం ప్రధాని మోదీకి చెందిన పాత ఫొటోను దిగ్విజయ్ పంచుకున్న సంగ తి తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్‌లో సామన్య కార్యకర్త నుంచి ప్రధానిగా మోదీ ఎదిగిన విధా నాన్ని ఆయన కొనియాడారు. ఇది బీజేపీ ఉన్న సంస్థాగతమైన శక్తి అని అభివర్ణించారు. అయితే కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సి న అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 

సొంత పార్టీ నుంచే వ్యతిరేకత

దిగ్విజయ్ వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది. దిగ్విజయ్ అభిప్రాయంతో  ఏకీభవించనని ఆ పార్టీ నేత పవన్ ఖేడా అన్నారు. గాడ్సే మద్దతుదారు లు.. గాంధీ అభిమానులు కాలేరని వ్యా ఖ్యానించారు. మరో నాయకురాలు సిప్రి యా శ్రీనాతే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఆరెస్సెస్ నుంచి నేర్చుకవాల్సిన అవసరం లేదన్నారు.