09-05-2025 07:19:56 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): విధి నిర్వహణలో భాగంగా వీర మరణం పొందిన వీర జవాన్ వడ్ల శ్రీధర్ నివాళులు పలువురు అర్పించారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో హోంమి నిర్వహిస్తున్న సమయంలో ల్యాండ్ మైన్ పేలుళ్లు వీర మరణం పొందిన కామారెడ్డి జిల్లా పాల్వంచ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ వడ్ల సీజన్ రాష్ట్రానికి అపూర్వమైన సేవలు అందించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు లు మాట్లాడారు. వడ్ల శ్రీధర్ కు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారు తెలిపారు.
ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని శ్రీధర్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. స్పెషల్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ రాష్ట్రానికి అపూర్వమైన సేవలు అందించారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు వీర జవాన్లు దేశానికి గర్వకారణమని వార్డుల శ్రీధర్ చూపిన ధైర్య సాహసాలు తిరస్మరణీయమైన ఆ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి మద్దతు లభించేలా చర్యలు తీసుకుంటా మనీ వారు పేర్కొన్నారు.