calender_icon.png 22 July, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపక్షాల నిరసనల పర్వం

22-07-2025 12:33:55 AM

  1. ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
  2. ఆపరేషన్ సిందూర్, ట్రంప్ వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని విపక్షాల డిమాండ్
  3. పలుమార్లు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ, జూలై 21: భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ, రాజ్యసభ సమావేశమయ్యాయి. తొలు త పహల్గాం ఉగ్రదాడి, ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఉభయ సభ లు నివాళులర్పించాయి.  అనంతరం రాజ్యసభలో కొత్తగా ఎంపికైన నలుగురు ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా.. లోక్‌సభలో తొలిరోజే విపక్షాలు నిరసనకు దిగాయి.

పహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’తో పాటు కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పడంపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష ఎం పీలు నిరసన విరమించాలని లోక్‌సభ స్పీ కర్ ఓం బిర్లా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అ యినప్పటికీ వారు వినిపించుకోకపోవడం తో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

అనంతరం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగా.. ప్రతిపక్షాలు డి మాండ్ చేసిన అన్ని అంశాలపై చర్చించేందు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు నిరసనలు ఆగకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.

సభ చివర్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ఓం బిర్లా సమయం కేటాయించారు. లోక్‌సభలో 16 గంటలు.. రాజ్యసభలో 9 గంటలు చర్చ జరగనుంది. అలాగే కొత్త పన్ను బిల్లులకు ౧౨ గంటల సమయం కేటాయించినట్టు స్పష్టం చేశారు. మొత్తం ఈసారి సమావేశాలు జూలై ౨౧ నుంచి ఆగస్టు ౨౧ వరకు జరగనున్నాయి.

ట్రంప్ వ్యాఖ్యలపై సమాధానం ఎక్కడ? : ఖర్గే

రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై నిప్పులు చెరిగారు. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించింది తానేనని పదే పదే ట్రంప్ ఎందుకు పేర్కొం టున్నారో కేంద్రం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. శాంతి ఒప్పందం జరిగితే దాని వివరాలు వెల్లడించాలని డిమాండ్  చేశారు.

పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఇం తవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఇంటలిజెన్స్ విషయంలో లోపం జరి గిందని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు.. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ గురించి ప్రభుత్వం ప్రపంచానికి, భారత ప్రజలకు చెప్పింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో సమాచారమివ్వాలని ఖర్గే కోరారు. 

జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు తీర్మానం

ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వం త్ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీ లు అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు. ఈ మే రకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 145 మంది , రాజ్యసభలోనూ 63 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు సమర్పించారు. 

ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశమివ్వలేదు: రాహుల్

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్య వహరిస్తున్న తనకు లోక్‌సభలో మా ట్లాడే అవకాశ మివ్వడం లేదని కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికార పక్షం సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడటానికి అవకాశమిచ్చి.. తనకు మాత్రం అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రతి పక్ష నేతను ఈ విధంగా చేయడం హక్కులను కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.