calender_icon.png 29 August, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఏ చెక్‌పోస్టుల రద్దుకు ఉత్తర్వులు

29-08-2025 03:49:29 AM

  1. జారీ చేసిన రవాణా శాఖ 
  2. ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, మొబైల్ చెకింగ్ వెహికిల్స్ ఏర్పాటు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): చెక్‌పోస్టుల వద్ద ఆర్టీఏ అధికారులు, సిబ్బంది చేస్తున్న భారీ అవినీతికి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఎప్పటి నుంచో చెబుతున్నట్టు చెక్ పోస్టులను రద్దు చేసింది. రాష్ర్టంలోని అన్ని రవాణా చెక్‌పోస్టులను రద్దు చేస్తూ గురువారం రవాణా శాఖ జీవోను విడుదల చేసింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత వాణిజ్య వాహనాల తనిఖీ కోసం సరిహద్దు చెక్‌పోస్టులను కొనసాగించడం అవసరం లేదని.. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే వాటిని తొలగించాయని, ఫలితంగా రవాణా రంగం వేగవంతమై వ్యాపార వాతావరణం మెరుగుపడిందని రవాణా శాఖ కమిషనర్ ఇప్ప టికే ప్రభుత్వానికి నివేదిక అందించారు.

ఈ మేరకు తెలంగాణలోనూ చెక్‌పోస్టులను తొలగించమని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ఈ సిఫార్సును పరిశీలించి, చెక్‌పోస్టుల వద్ద జరుగుతున్న మోటారు వాహ న చట్టానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను (ట్యాక్స్ వసూలు, తనిఖీలు, చెల్లిం పులు మొదలైనవి) తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వాణిజ్య రవాణా మరింత వేగవంతమవుతోందని, వ్యాపార సౌలభ్యం పెరిగి, రాష్ర్ట ప్రతిష్ఠకు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చెక్‌పోస్టులను రద్దు చేసినా వాహ నాలు పన్నులు చెల్లించకుండా రాష్ట్రంలోకి రాకుండా చూసేందుకు సర్కారు ప్రత్యేక మొబైల్ తనిఖీ వాహనాలను, ఏఎన్‌పీఆర్ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. చెక్‌పోస్టుల వద్ద పనిచేసే సిబ్బందిని రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల కోసం బదిలీ చేయనున్నారు. 

చెక్‌పోస్టుల రద్దు సమస్యలు లేకుండా..

* తాత్కాలిక అనుమతులు, మోటారు వాహన పన్ను చెల్లింపులు అన్నీ ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా మాత్రమే జరగాలి. పొరుగు రాష్ట్రాల ఆర్టీవోలతో సమన్వయం చేస్తూ వాహనదారుల సంఘాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి.

* పోర్టల్, వాహన్ సాఫ్ట్‌వేర్‌లో వాలంటరీ ట్యాక్స్, తాత్కాలిక అనుమతుల చెల్లింపులకు ప్రత్యేక సౌకర్యం కల్పించాలి.

* చెక్‌పోస్టుల్లో పనిచేసే సిబ్బంది.. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్లను జిల్లాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులకు (ట్యాక్స్ ఎగవేత నియంత్రణ, రోడ్డు భద్రత, వాహన ఉల్లంఘనల పర్యవేక్షణ) బదిలీ చేయాలి. వీరి పనితీరును డీటీసీ పర్యవేక్షిస్తారు.

* చెక్‌పోస్టులు తొలగించిన తర్వాత ఆరునెలల పాటు ప్రత్యేక మొబైల్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసి, పన్ను చెల్లింపులు లేకుండా వాహనాలు రాష్ర్టంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి.

* ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తనిఖీల కోసం వాహన నంబర్లను రికార్డ్ చేసేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను బిగించాలి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను కేంద్రం ఎన్‌ఐసీ వాహన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయాలి.

* ట్యాక్స్ చెల్లించకుండా నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ట్యాక్స్ విధించే క్రమంలో ఆన్‌లైన్ రికార్డ్ కోసం ఎంవీఐలు, ఆర్టీవోలకు హ్యాండ్‌హెల్డ్ పరికరాలు ఇవ్వాలి.

* జిల్లాల వారీగా ఎంవీఐలు, ఆర్టీవోలు వాహనాల పర్యవేక్షణను క్రమం తప్పకుండా పరిశీలించి, పన్ను వసూళ్లను కఠినంగా అమలు చేయాలి.