29-08-2025 03:46:24 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 28 (విజయ క్రాంతి): భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదల్లో చిక్కు కున్న దాదాపు రెండువేల మందిని రక్షిం చినట్లు తెలంగాణ డిజీపీ జితేందర్ తెలిపా రు. వర్షాలకు సుమారు ౧౦ మంది వరకు మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నామని, అయితే మరణాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉందని ఆయన తెలిపారు.గురువారం డీజీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డిన ఆయన వర్షాల ప్రభావంపై పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఈ సహాయక చర్యల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సహకారం తీసుకు న్నామని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రెండు హెలికాప్టర్లను ఉప యోగించినట్లు డీజీపీ తెలిపారు. సహాయక బృందాలు నిరంతరం అందుబా టులో ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండా లని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైనా ఆపదలో ఉన్నవారు తక్షణ సహాయం కోసం 100 నంబర్‌కు డయల్ చేయాలని ఆయన సూచించారు.
కామారెడ్డి, మెదక్, నిర్మల్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తు న్నాయని, ఈ ప్రాంతాల్లోని స్థానిక పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, బాధితులను ఆదుకుంటున్నారని తెలియజేశారు. భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అత్యవసర మైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని డీజీపీ ప్రజలకు సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండటానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.