18-10-2025 01:02:24 AM
సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కిన తాజాచిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధిశెట్టి, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రముఖ స్టైలిష్ నీరజ కోన దర్శకత్వం వహించారు. పీపుల్‌మీడియాఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని, ప్రేక్షకాదరణ పొందుతుండటంతో మేకర్స్ శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో సిద్దు మాట్లా డుతూ.. “తెలుసు కదా’ సినిమా నేను చేయాలని డిసైడ్ అయినప్పుడు నా మనసులో ఒక భయం ఉండేది. నటుడిగా కాదు రైటర్‌గా భయం ఉండేది. ప్రతి సీన్‌లో పంచులు లేకపోతే థియేటర్‌ను హోల్డ్ చేయగలమా లేదా అన్నదే ఆ భయం. ఇప్పుడు నాకు ఆ భయం పోయింది. హౌస్‌ఫుల్ షోస్ చూస్తుంటే మేము సక్సెస్ అయ్యామనే ఆనందం కలిగింది. ప్రేక్షకులకు వరుణ్ వినోదం పంచుతాడు. పాత్రలన్నీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి” అన్నారు. డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ.. “ఇది నా ఫస్ట్ ఫిలిమ్.
సినిమా కు వస్తున్నా రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఉంది. మేము కనెక్ట్ అయిన పాయింట్‌కి ఆడియన్స్ కూడా అంతే అద్భుతంగా కనెక్ట్ కావడం చాలా ఆనందాన్నిచ్చింది” అన్నారు. ‘ఈ సినిమా కు క్లాస్ థియేటర్‌లో, మాస్ థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. ఆడియన్స్ చాలా ఓన్ చేసుకుంటున్నారు. టిల్లు మీ అందరిని నవ్విస్తే వరుణ్ అందరికీ కనెక్ట్ అవుతాడు’ అని నటుడు వైవా హర్ష తెలిపారు.