17 April, 2026 | 2:16 AM

పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ వస్తున్నాడు!

18-10-2025 01:03 AM

శ్రీశివాజీ ప్రొడక్షన్స్ మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుధీర్ శ్రీరామ్ రచనాదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివాజీ, లయ జంటగా నటిస్తున్నారు. ‘90ఎస్’ వెబ్‌సిరీస్‌లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శివాజీ పంచా యతీ సెక్రెటరీ శ్రీరామ్ పాత్రలో కనిపించనున్నారు.

దీపావళి సందర్భంగా టీమ్ విడుదల చేసిన పోస్టర్‌లో జీపీ సెక్రెటరీ శ్రీరామ్.. తన కుటుంబంతో కలిసి దీపావళి పండుగ చేసుకునేందుకు పటాకులు తీసుకుని వెళుతున్నట్టు అర్థమవుతోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర విశేషాలు చిత్రబృందం వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్రానికి సంగీతం: రంజిన్ రాజ్; కెమెరా: రిత్విక్‌రెడ్డి; ఎడిటర్: బాలు మనోజ్ డీ; నిర్మాత: శివాజీ సొంటినేని; రచనాదర్శకత్వం: సుధీర్‌శ్రీరామ్.