20-09-2025 12:59:28 AM
మహాజన సేన పార్టీ అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలు రాజ్యా ధికారం తేవటమే మహాజన సేన పార్టీ లక్ష్యమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మహాజన సేన పార్టీని ప్రదీవ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిర్భవించింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవి ష్కరించారు.
అనంతరం బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదునూరి రాజు అధ్యక్షతన జరిగిన మీడి యా సమావేశంలో ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ... ఎస్సి, ఎస్టి, బిసిలకు రాజ్యాధికారం అందని ద్రాక్షలాగా మారిందని అన్నారు. 10శాతం ఉన్న అగ్రవర్ణ కులాలు 90శాతం ఉన్న బహుజన ప్రజలను పాలించడమేమిటని ప్రశ్నించారు. ఎస్సి, ఎస్టి, బిసిలపక్షాన రాజకీయ నాయకత్వంలోపమో ఈ పరిస్థితికి కారణ మని అభిప్రాయపడ్డారు.
బడు గు, బలహీన వర్గాలను ఐక్యం చేస్తూ బలమైన ఉద్యమం ద్వారా సామాజిక న్యాయా న్ని సాధిస్తామన్నారు. అందుకు మహాజన సేన పార్టీ నిర్విరామ కృషి చేస్తుందన్నారు. అన్నిరంగాల్లో బిసి రిజర్వేషన్ల సాదనకు ఉద్యమిస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యం యువతకు, మహిళలకు తమ పార్టీ అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సి, ఎస్టి రిజర్వేషన్ల వర్గీకరణ కు మహాజన సేన పార్టీ ఉద్యమి స్తుందని వివరించారు.
వికలాంగులు, మహిళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 75 ఏండ్లుగా బిసి సిఎం ఎందుకు కాలేదని ఆలోచన చేయాలన్నారు. నాయకత్వం, పడతల వ్యామోహంతోనే బిసిలు రాజ్యాధికారానికి వెనుకబడ్డారని అభిప్రాయపడ్డారు. రెడ్లను, వెలమలను తిట్టిన మాత్రాన బహుజనులకు రాజ్యాధికారం రాదన్నారు. మన ఓట్లు మనోడికి వేసేలా బహుజనుల్లో ఓటు చైతన్యం రావాలని అప్పుడే రాజ్యాధికారం సాధ్యమవు తుందని తెలిపారు.
2028 కల్లా మహాజన సేన పార్టీకి మహాశక్తిగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. సామా జికవేత్తలు ఉద్యమకారులు, మహిళలు, యువత అంతా మహాజన సేన పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో విహెచ్పిఎస్ జాతీయ నేతలు మంగమ్మ, పణ్మకరావు, పార్టీ ప్రతినిదులు గట్ల రాజన్న నేదునూరి సంపత్ ,ప్రశాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.