09-08-2025 03:03:16 AM
బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరి సింగ్ జాదవ్
సనత్‌నగర్ ఆగస్టు 8: -ఎస్ ఆర్ నగర్ ఎస్సార్ నగర్ లో కొలువైన శ్రీ వీరాంజనేయ శ్రీ వెంకటేశ్వర శ్రీ షిరిడి సాయి బాబా ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి బాపునగర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరి సింగ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులు అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ సిటిజన్స్ మధు సింగ్, జగన్ సింగ్ , బాలు నాయక్, ధన సింగ్ , పాండు ,హరిచంద్ ,రాములు పాల్గొన్నారు.