13-09-2025 06:46:58 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): మహిళా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ గా రజిత రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి నియామక పత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి, పార్లమెంటు అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి రజిత రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ, త్వరలోనే అన్ని డివిజన్ కమిటీలను పూర్తి చేసి తన బాధ్యతను నిర్వర్తిస్తానని తెలిపారు.