15-09-2025 12:50:13 AM
ఐఎన్టీయూసీ- వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమూద్
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఐఎన్టీయూసీ- ఎస్‌డబ్ల్యూయూ రాష్ర్ట సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరోసారి సయ్యద్ మహమూద్‌ని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి నియమించారు. ఈ మేరకు ఆయనకు ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ మహమూద్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ ఎస్‌డబ్ల్యూయూ యూనియన్ బలోపేతంతోపాటు, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
అదేవిధంగా తనకు రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ మహమూద్ నియమితులైన శుభసందర్భంగా ఆ సంఘం రాష్ర్ట ఆఫీస్ బేరర్లు గొడిశాల అబ్రహాం, జక్కుల మల్లేష్, జయ, హాఫీజ్ ఖాన్ ఈమేరకు అభినందించారు.