calender_icon.png 5 May, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలు వసతి గృహాల్లో మరమ్మతులు తక్షణమే చేపట్టండి

05-05-2025 08:06:25 PM

అధికారును ఆదేశించిన పిఓ రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): వేసవి సెలవుల నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నందున విద్యార్థినీ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలలో నెలకొన్న సమస్యలు త్వరగా పరిష్కరించే విధంగా మరమత్తులు చేపట్టాలని ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాల, గ్రంథాలయంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో మైనర్ రిపేర్లతో పాటు విద్యార్థినిల సౌకర్యార్థం నిర్మాణం చేపడుతున్న డైనింగ్ హాల్ పనులు, గ్రంథాలయంలో పాటకుల కోసం నిర్మాణం చేపడుతున్న రీడింగ్ రూమ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠకులు విశ్రాంతిగా కూర్చుని పేపర్లు చదివే విధంగా రీడింగ్ రూమ్ తయారు కావాలన్నారు. డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు పాఠశాల చుట్టూ మైనర్ రిపేర్లు ఏమైనా ఉంటే డ్రైనేజీలు గాని, ప్యాచ్ వర్క్లు పనులు పూర్తి కావాలని, పాఠశాలలో తెరిచే లోపల ఏ పాఠశాలలో మైనర్ రిపేర్లు, మేజర్ రిపేర్లు ఉన్నట్లు తన దృష్టికి రాకూడదన్నారు. అందుకు సంబంధిత ఇంజనీర్లు, హెచ్ఎం వార్డెన్ లతో సమన్వయంతో ఉండి నిర్మాణం పనులు చేపట్టాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏటిడివో అశోక్ కుమార్, డి ఈ హరీష్, టీఎ శ్రీనివాస్, గ్రంథాలయం అధికారి జాని తదితరులు పాల్గొన్నారు.