calender_icon.png 6 May, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ గా సాబీర్ పాషా ఎన్నిక

05-05-2025 07:50:56 PM

అభినందించిన జిల్లా ఒలంపిక్ అసోసియేషన్, క్రీడా సంఘాల బాధ్యులు...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగుడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్(Olympic Association) ఆధ్వర్యం కొత్తగూడెంలోని హోటల్ లేపాక్షిలో జరిగిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ ప్రతిపాదన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జీ.యుగంధర్ రెడ్డి ప్రతిపాదించగా అన్ని క్రీడా సంఘాలు ఏకగ్రీవం ఆమోదించటం జరిగింది.

ఈ సందర్బముగా ఎస్.కె.సాబీర్ పాషా మాట్లడుతూ... భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో మంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, జిల్లాలో ఒక్క పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించుకోవాలని దానికి సుమారు 46 ఎకరాలు స్తలం అవసరం వుంటుందని తద్వారా అన్నిక్రీడలకు కోచ్ లు, క్రీడాపరికరాలు సాధనకు తనవంతు కృషి ఎప్పటికి ఉంటుందని తెలిపారు. ఈ సందర్బములో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అద్యక్షులు డాక్టర్ జీ.యుగంధర్ రెడ్డి, చైర్మన్ కె.మహిధర్, వైస్ ప్రెసిడెంట్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి పి. కాశి హుస్సన్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బరిగెల భూపేష్ కుమార్, మట్టపర్తి రమేశ్, జిల్లా రెజ్లింగ్ గౌరవ అద్యక్షులు నాగ సీతారాములు, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డి.మల్లికార్జున, సీనియర్ అథ్లెట్ ఎండీ.బాబ్జి, చీఫ్ కోచ్ పి.నగేందర్, జిల్లా తైక్వాండో కార్యదర్శి ఈ.మొగిలి, జిల్లా కరాటే సెక్రటరీ ఇంద్రాల శ్రీదర్, జిల్లా కేంద్రం షూటింగ్ సెక్రటరి ఎండీ.అబ్దుల్ నబీ, బాస్కెట్బాల్ కోచ్ బాబు, జిల్లా టేబుల్ టెన్నిస్ జాయింట్ సెక్రటరీ రియాజ్, జిల్లా జూడో అధ్యక్షుడు  ఐ.అదినారాయణ, జిల్లా వూషూ సెక్రటరీ రఘు, జాయింట్ సెక్రటరీ రమేశ్ జిల్లా సాఫ్ట్బాల్ జాయింట్ సెక్రటరీ ఎం.జస్వంత్ బాక్సింగ్ కోచ్ లు సత్తిబాబు, ఈశ్వర్, శ్రీనివాస్ తదితరులు అభినందించారు.