05-05-2025 07:53:57 PM
కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి వినతిపత్రం అందించిన బీజేపీ నాయకులు..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో 1995లో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ కేంద్ర రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Minister Nitin Gadkari)కి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. సోమవారం జాతీయ రహదారుల ప్రారంభోత్సవానికి కాగజ్ నగర్ కు వచ్చిన కేంద్రమంత్రిని పట్టణ బిజెపి నాయకులు రొడ్డ మోహన్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా మాజి ప్రధాన కార్యదర్శి రొడ్డ మోహన్ మాట్లాడుతూ... పట్టణంలో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించి, 1/70 ఆక్ట్ ను ఎత్తివేయాలని, 2002లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ప్రారంభానికి నోచుకోలేదని కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి లెదర్ ఫ్యాక్టరీని ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ లో ఎక్ ప్రెస్ రైళ్లు ఆగటం లేదని, ప్యాసింజర్, రామగిరి, సింగరేణి సూపర్ఫాస్ట్ రైళ్లను నిలుపుదల చేయాలని కోరారు.
పట్టణంలోని పాత బస్టాండ్, రామన్ కాలనీ, యాపల్, విద్యానగర్ ఏరియాల ప్రజలు రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు వీలుగా రైల్వే ట్రాక్ పక్క నుండి రైల్వే స్టేషన్ కి అప్రోచ్ రోడ్డు నిర్మించా లన్నారు. జిఎం కార్యాలయం సమీపంలో ప్రజలు రోడ్డు దాటెందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామటెంకి దుర్గారాజు, మల్యాల రాజమల్లు, కోలేటి శివ, నాగపురి సంతోష్ ప్రసాద్ లు పాల్గొన్నారు.
కాగజ్ నగర్ తరలివెళ్ళిన బిజెపి నాయకులు
జిల్లాలోని 363 జాతీయ రహదారుల ప్రారంభోత్సవానికి కేంద్ర రహదారి అభివృద్ధి శాఖ మంత్రి కాగజ్ నగర్ వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు పట్టణంలోని బిజెపి నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. తరలిన వారిలో పట్టణ, మండల బిజెపి నాయకులు దాని అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.