24-09-2025 06:41:24 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసీలో ఇటీవల విడుదల చేసిన డ్రైవర్లు, శ్రామికులు, ఇతర కేటగిరీల ఉద్యోగ నోటిఫికేషన్‌లపై ప్రైవేట్ హెయిర్ బస్ డ్రైవర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి 30 శాతం వెయిటేజ్ ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి. దివాకర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో సేవలు అందిస్తూ సంస్థను లాభదాయకంగా మార్చడంలో ప్రైవేట్ డ్రైవర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషించారన్నారు. ప్రభుత్వ శాఖల్లో వేటేజ్ మార్కులు ఇచ్చిన విధంగా, ఆర్టీసీ నియామకాలలో వీరికీ 30% వెయిటేజ్ ఇవ్వాలని లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.