19 July, 2026 | 3:41 PM

పాక్ కార్గో విమానం ఎక్కడ మిస్సైంది?

09-07-2026 12:46 AM
Karachiకి చేరుకునే ముందు Boeing 737 ఎందుకు అదృశ్యమైంది? Pakistan Cargo Plane కోసం సముద్రంలో గాలింపు కొనసాగుతోంది.

Sharjah నుంచి Karachiకి బయల్దేరిన Pakistanకు చెందిన Boeing 737 కార్గో విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. అరేబియా సముద్రం ప్రాంతంలో విమానం అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతుండగా, విమానం కూలిపోయిందని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు.

ఇస్లామాబాద్, జూలై 8: పాకిస్థాన్‌కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం కరాచీలో ల్యాండవడానికి ముందు మిస్సయ్యింది. షార్జీ నుంచి కరాచీకి వస్తుండగా మంగళవారం రాత్రి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. బలూచిస్థాన్ సమీపంలోని అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా విమానం అదృశ్యమైనట్లు పీఏఏ (పాక్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ) అధికారులు ప్రకటించారు.

విమానం ఆచూకీ కోసం సముద్రంలో గాలింపు చర్యలు ప్రారంభించామని, విమానంలో ఐదుగురు ప్రయాణికులున్నారని అన్నారు. 1999లో ప్రయాణికుల కోసం రూపొందించిన ఈ విమానాన్ని 2012 నుంచి సరుకు రవాణా కోసం వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. కాగా విమానం కూలిపోయినట్లు అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. 2020 మే నెలలోనూ కరాచీలో పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయి 97 మంది మృతి చెందారు.

Pakistan Cargo Plane ఎందుకు వార్తల్లో నిలిచింది?

Sharjah నుంచి Karachiకి వస్తున్న Boeing 737 కార్గో విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయి అదృశ్యమైంది. విమానం ఆచూకీ కోసం అధికారులు సముద్రంలో గాలింపు చేపట్టారు.

RELATED ARTICLES.....

అమెరికాలో కూలిన కార్గో విమానం

పాక్ ఐసీస్ స్థావరాలపై ఆఫ్గన్ దాడులు

పాక్ ఆఫ్గన్ పోరు!

సింధూ జలాల నిలిపివేతపై పాక్ అక్కసు

ఆఫ్గనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు

బంగాళాఖాతంపై పాక్ కన్ను!