calender_icon.png 24 May, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మూడా’ తీరే వేరు!

24-05-2025 12:04:03 AM

-ముడా పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో 50 ప్రత్యేక బస్టాప్‌ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ 

-ఒక్కో బస్ స్టాప్ కు దాదాపుగా రూ 3 లక్షల ఖర్చు 

-బస్ షెల్టర్ ఖర్చులో 30% మూడ భరిస్తుంది అని ఒప్పందం 

-100% భరించే సంస్థకు కాకుండా ఇతర సంస్థ తో ఒప్పందం జరిగినట్టు ఆరోపణలు

-పదేళ్లపాటు ఆ బస్ స్టాప్ లో హోల్డింగ్స్‌లో ప్రచారబాధ్యతలు వారికే నంట 

-మూడా కౌన్సిల్ లో ఒప్పందం జరిగింది : మూడా చైర్మన్లక్ష్మణ్ యాదవ్ 

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లా అరుదైన గౌరవంలో ముడా గుర్తింపు కూడా ప్రత్యేకమైనది. జిల్లావ్యాప్తంగా మూడా పరిధి విస్తరణ జరిగినప్పటికీ జనం ఆశలు మాత్రం ఆశించిన మేరకు జరగడం లేదని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు నియోజకవర్గాల్లో మూడ పరిధి విస్తరించి ఉంది. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలలో ప్రధాన రోడ్లపై 50 బస్ షెల్టర్లు ఏర్పాటు చేసింది మూడ ఓ కంపెనీతో ఒప్పందం చేస్తుంది. ఈ ఒప్పందం కూడా పదేళ్లపాటు కొనసాగిలా అగ్రిమెంట్ చేసుకున్నారు. 

పదేళ్లపాటు ప్రచార హక్కులు వారికే...

ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ పెంచుతూ ముందుకు సాగాల్సిన ముడ ఆశించిన మేరకు అడుగులు వేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూడ పరిధి లో ఏర్పాటు చేస్తున్న బస్ షెల్టర్లు 70% ఏర్పాటు చేస్తున్న సంస్థ భరిస్తుంది. 30% ఖర్చు ముడా భరిస్తుంది.

ఈ ఒప్పందం పదేళ్లపాటు మూడ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పదేళ్లపాటు ప్రభుత్వానికి, ముడా కు ఎలాంటి సంబంధం లేకుండా ఆ బస్ సెంటర్లలో ప్రచార హోర్డింగ్స్ ఆ ప్రైవేట్ సం స్థ పరిధిలోనే ఉంటాయి. బస్సు సెంటర్లలో ప్రచారం బోర్డులు ఏర్పాటు చేసుకున్నప్ప టికీ అవి పూర్తిగా వారు నిర్ణయించిన దరికి అనుగుణంగా ఉండలు న్నాయి. దీంతో ఒక బస్ షెల్టర్ పదేండ్లు ఉండడంతో ఇలా 50 బస్ షెల్టర్లు వారి పరిధిలో ఉండడంతో అత్యధిక లాభం ఆ సంస్థలకే చేరి విధంగా కూడా చర్యలు తీసుకుందని ఆరోపణలు ఊపందుకున్నాయి. 

30% ఖర్చు లేకుండా ఇతర సంస్థలు ముందుకు

మూడవ పరిధిలో 50 బస్ షెల్టర్లు ఏర్పాటు చేసుకుంటూ 70% సంస్థ భరించగా మరో 30 శాతం మూడ ఎందుకు భరించాల్సి ఉంటుందని కొందరు ఆసాన్న వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రోడ్ల పక్కనే బస్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బస్సు షెల్టర్ల పైనే హోల్డింగ్స్ ఉండడంతో ప్రచారానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

దీంతో ఓ సంస్థ గత ఏడాది క్రితం ఈ బస్సు సెంటర్ల ఒప్పందానికి సంబంధించి పూర్తిగా 100% ఖర్చు భరిస్తూ ఏర్పాటు చేసుకుంటామని ముందుకు వచ్చినప్పటికీ వారితో చేయలేదని విమర్శలు ఉన్నాయి. పదేళ్లపాటు వారికి ప్రచార హక్కులు ఇవ్వడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచార బోర్డులో జిల్లా కేంద్రంలో పాటు ప్రధాన రోడ్లపై మూడ అనుమతులతో ఏర్పాటు అవుతున్నాయి. ప్రజాధనం వృధా కాకుండా కూడా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. 

ఒప్పందం జరిగింది...

జిల్లాలోని మూడు నియోజకవర్గ పరిధిలో 50 బస్సు షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక్క బస్సు షెల్టర్ కు రూ. రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తంలో 30% ఖర్చు కూడా భరిస్తుంది. మూడ అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. 70% ఆ సంస్థ భరిస్తుంది. పదేళ్లపాటు బస్సు షెల్టర్ల లో ప్రచార హక్కులు వారికి ఉండనున్నాయి. ఈమెకు సర్వసభ్య సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. 

 లక్ష్మణ్ యాదవ్, మూడ చైర్మన్, మహబూబ్ నగర్ ముడా అనుమతులు ఉన్నాయి...

మున్సిపల్ పరిధిలో బస్ షెల్టర్లు ఏర్పాటు విషయం సంబంధించి మూడో అనుమతులు ఉన్నాయి. ఆ అనుమంతులతోటే నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రచార హక్కులు కూడా వారికి ఉంటాయి. మున్సిపల్ అనుమతి కూడా ఉంటుంది. పరదర్శకంగా పనులు జరుగుతున్నాయి. సమస్త ఈ పండ్ల ప్రక్రియను చేస్తుంది. మూడ నిబంధనల మేరకు ముందుకు సాగడం జరుగుతుంది. 

 మహేశ్వర్ రెడ్డి, మహబూబ్‌నగర్ కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్