03-01-2026 12:00:00 AM
ఆలేరు, జనవరి 2 (విజయక్రాంతి): మండలంలోని మంతపురి గ్రామంలో జన్మించిన పల్లె శ్రీనివాసులు గౌడ్ అంచలంచలుగా ఎదుగుతూ ముందుగా ఎన్ ఎస్ యు ఐ యువజన నాయకుడగా, మంతపురి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీకి లేని సేవలు చేసినందుకు టి పి సి సి జనరల్ సెక్రెటరీని చేశారు.
మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో వరంగల్ పార్లమెంటరీ ఇంచార్జిగా వరంగల్ జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేక సర్పంచి పదవులను కైవసం చేసుకునేటట్లు చేశారు. అందుకు గాను పల్లె శ్రీనివాస్ గౌడ్ ను ప్రగతి భవన్ లో కృష్ణ, గోదావరి నది జలాలపై జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాల్గొనే అవకాశం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.