calender_icon.png 3 January, 2026 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయంలో నేడు శివ ముక్కోటి

03-01-2026 12:00:00 AM

ములకలపల్లి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ములకలపల్లి శివాలయంలో శనివారం పుష్యమాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివ ముక్కోటి అనే కార్యక్రమాన్ని స్థానిక శివాలయంలో నిర్వహించనున్నట్లు  శివాలయం దేవస్థానం కమిటీ చైర్మన్ నరాటి ప్రసాద్ తెలిపారు. ఆరోజు స్వామివారికి సమర్పించే అభిషేకం కోటి అభిషేకాలతో సమానం. ఈ సందర్భంగా ఉ. 5-30 నుండి ఉ.10 గంటల వరకు స్వామివారికి అభిషేకములు జరుగును.

ఆరోజు పౌర్ణమి ఉన్నందువలన ఉదయం 10 గంటలకు అమ్మవారికి అభిషేకం సా. 6-30 గంటల నుండి లలితా సహస్ర నామ పారాయణ కలవు.భక్తులు అధికసంఖ్యలో పాల్గొని శ్రీ ఉమా పృథ్వీరామలింగేశ్వర స్వామి వార్ల అనుగ్రహమునకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. అమ్మవారికి చీర, పూల మాలలు, ప్రసాదాలు సమర్పించే సేవలో పాల్గొనే భక్తులు 9640141600 ఈ సెల్ నెంబర్ లో సంప్రదించాల్సిందిగా సూచించారు.