calender_icon.png 24 January, 2026 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో అటవీశాఖ అధికారి మృతి

23-09-2024 01:08:43 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ శాఖ అధికారి తీవ్ర గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. చాతకొండ అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సురేష్ ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. పాల్వంచ పట్టణ పరిధిలోని మంచికంటి నగర్ లో నివాసముంటున్న సురేష్ ఇంటి వద్దనే మృతి చెందారు. ఆయన కారేపల్లి నివాసిగా గ్రామస్తులు తెలిపారు. సురేష్ కు కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన మరణ వార్త జిల్లా అటవీ శాఖలో తీవ్ర విషాదం నింపింది.