calender_icon.png 24 January, 2026 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనసంద్రమైన జాన్‌పహాడ్ దర్గా

24-01-2026 12:13:16 AM

  1. గంధం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్

అంగరంగ వైభవంగా ఉర్సు 

ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన భక్తులు

పాలకవీడు, జనవరి 23 : జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో   రెండోరోజైన శుక్రవారం ఉర్సె షరీఫ్ లో భాగంగా గంధం మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. కాగా దానిని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు రావడంతో దర్గా ప్రాంతమంతా జనసంద్రంతో హోరెత్తింది. దర్గా వక్ఫ్ బోర్డు, దర్గా ముజావర్లు, కాంట్రాక్టర్లు తెచ్చిన గందాన్ని దర్గా సమీపంలోని చందన్ ఖాన్ లో పెట్టారు. తదుపరి గంధాన్ని  గుర్రంపై పెట్టి జానపహాడ్ దర్గా చుట్టుపక్కల గ్రామాలైన జానపహాడ్, కల్మెట తండా, చెర్వుతండాల్లోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు.

చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లిన గంధం బిందెలను తాకెందుకు ఆయా గ్రామాల ప్రజలు ఉత్సాహాన్ని చూపారు. ఈ గందాన్ని తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, భూత,ప్రేత పిశాచాలు తొలిగిపోతాయనే నానుడి ఉండడంతో భక్తులు తాకేందుకు వరుసలు కట్టారు. గ్రామాల్లో తిప్పుకొని వచ్చిన గందాన్ని ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేసి దర్గాలోని బాబా సమాధులపై ఎక్కించారు. ముందుగా వక్ఫ్ బోర్డు నుంచి గంధానికి భారీ నీటిపారుదల, పౌర సరఫరాశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ నరసింహ,స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ,వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్గాలో మంత్రి ప్రత్యేక పూజలు  

ఉర్సు సందర్భంగా దర్గాలో నీటిపారుదల, పౌర సరఫరాశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ నరసింహలు ఉన్నారు.

లక్షకు పైగా హాజరైన భక్తులు..

ఉర్సు ఉత్సవల్లో రెండో రోజు ఉర్సీ షరీఫ్ లో భాగంగా గంధం ఊరేగింపు కావడం తెలుగు రాష్ట్రల నుంచి భక్తులు గురువారం రాత్రి దర్గాకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంతంలోని విధులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. గతంలోమొక్కుకున్న మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో సుమారు లక్ష మంది దర్గా దర్శించుకున్నట్లు అంచనాలు వేస్తున్నారు. కాగా దర్గా పక్కనేనున్న నాగులపుట్టకు పాలు, గుడ్లు, పూలు వేసి కొబ్బరికాయలు కొట్టి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు.

ప్రజలకు అందుబాటులో మెడికల్ క్యాంపు..

పాలకవీడు మండల వైద్య అధికారి సౌమ్యశ్రీ ఆధ్వర్యంలో ఉర్సు కు వచ్చిన భక్తులకు అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో ఉర్సు కు వచ్చిన వ్యక్తులు క్యాంప్ ను చూసి సంతోషం వ్యక్తం చేశారు.

కట్టదిడంగా పోలీస్ బందోబస్త్..

దర్గాకు వచ్చే భక్తులకు అవాంఛనియ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ, రవీందర్ రెడ్డి, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సిఐలు, ఎస్‌ఐ లు మొత్తం 500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్త్ నిర్వహించారు. దర్గా ప్రాంతంలో మైకుల ద్వారా సమాచారాన్ని ప్రజలకందిస్తూ వారిని అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కమలాకర్, ఎంపీడీఓ లక్ష్మి,మాజీ ఎంపీపీ గోపాల్, మాజీ జడ్పీటీసీ బుజ్జి మోతిలాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుబ్బారావు,శైషు రెడ్డి జితేందర్‌రెడ్డి తదితరులు పాలోన్నారు.