24-01-2026 12:15:41 AM
సంస్థాన్ నారాయణపూర్,జనవరి 23 : చిన్ననాటి నుండే క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దే భాద్యత మన అందరిపై ఉందని సర్వేలు గ్రామ సర్పంచ్ చిలక రాజు చందన రాజు అన్నారు. శుక్రవారం సర్వేలు ఎర్రగుంట మరి గూడెం లోని అంగన్వాడి కేంద్రాలలోని విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిలకరాజు చందన రాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడి కేంద్రాలను తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు బోయ చందు, సిలివేరు సువర్ణ గాలయ్య , వీరమల్ల నర్సింహ, రమాదేవి నరసింహ, సెక్రటరీ చంద్రశేఖర్, అంగన్వాడి టీచర్లు ఈ.దేవిక,కే.సత్తమ్మ, కే.శైలజ, వి.శోభ, ఈ. భాగ్యలక్ష్మి, ఏఎన్‌ఎం ముత్యాలు, అండాలు, ఆశ వర్కర్లు , సుగుణమ్మ సరిత కవిత, మాజీ సర్పంచ్ మానుపాటి సతీష్ కుమార్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.