calender_icon.png 24 January, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్, హరీశ్ సిట్‌ను బెదిరిస్తుండ్రు

24-01-2026 12:13:31 AM

  1. ఇద్దరిని అరెస్టు చేసి కేసు విచారణ సాఫీగా సాగేలా చూడాలి 
  2. అడిషన్ డీజీపీకి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్  ఫిర్యాదు 
  3. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని వ్యాఖ్య 

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి ) :  సిట్ అధికారులను బెదిరిస్తున్న కేటీఆర్, హరీశ్‌రావులపై చర్య లు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూ ర్  వెంకట్  అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అధికారులను బెదిరించేలా మాట్లాడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ప్రభావితం చేసేలా అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని శుక్రవారం ఆయ న డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీశ్‌రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీజీపీని కోరినట్లు తెలిపారు.

పోలీసు అధికారులను బెదిరించి కేసు నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావును అరెస్టు చేసి కేసు విచారణ సాఫీగా సాగేలా చూడాలని కోరారు.  ఫోన్ ట్యాపింగ్‌లో తప్పు చేశారా..? లేదా. .? అనేది తేల్చాల్సింది పోలీసు అధికారులని, కానీ కేటీఆర్, హరీశ్‌రావు మాత్రం ఎవరికి వారే తప్పు చేయలేదని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఏ తప్పు చేయనప్పుడు వాస్తవాలను సిట్ అధికారులకే చెప్పుకోవాలని సూచించారు.

విచారణ సందర్భం గా అధికారులతో ఒక విధంగా, బయటకు వచ్చాక మరో విధంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ వెం కట్ విమర్శించారు. ‘ఫోన్ ట్యాపింగ్ విచారణలో దొరికిపోతామనే భయం కేటీఆర్‌లో కనిపిస్తోంది. అందుకే ఫోన్ ట్యాపింగ్ సర్వ సాధారణమే అంటున్నాడు. గతంలో కర్ణాటకలో ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసిన సందర్భలున్నాయి.

దేశ భద్రత కోసం విద్రోహుల ఫోన్లనే నిబంధనల మేరకు ట్యాప్ చేస్తారు. కానీ మీలా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయరు. లొట్టపీసు కేసు అన్న కేటీఆర్.. ఇప్పుడు మాట మార్చడమేం టీ..? మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే . మీ రాజకీయాల కోసం ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను బ్లాక్ మెయిల్ చేసే హక్కు ఎవరిచ్చారు ’ అని ఆయన నిలదీశారు.