calender_icon.png 1 July, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీరాజ్ టీచర్లను బదిలీ చేయాలి

01-07-2025 02:18:44 AM

వారి విభాగాలకు బదిలీపై పంపాలని కోరుతూ డీఎస్‌ఈకి లోకల్ క్యాడర్ జీటీఏ విజ్ఞప్తి 

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాం తి): ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు వేర్వేరని సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను వారి శాఖలకు బదిలీ చేయాలని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వీరాచారి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్‌కు సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు.

పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరూ ఏ జిల్లాలో ఉన్నవారు ఆ జిల్లా పరిషత్ సీఈవో పరిధిలో మాత్రమే పనిచేయాలని, ఈక్రమంలోనే వారిని పంచాయతీ జిల్లా పరిషత్ సీఈవోలకు అప్పగించాలని కోరారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 33 నూతన జిల్లాలను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 ప్రకారం పాత పది జిల్లాలు, జోన్లను కొనసాగించాలని ఆయన కోరారు.