05-10-2025 01:23:49 AM
మొదటి మూడు స్టేజీలకు చార్జీల్లో రూ.5.. నాలుగు, ఆపై స్టేజీలకు రూ.10 పెంపు
-రేపటినుంచి అమల్లోకి..
-పండుగ తర్వాత ప్రయాణికులకు షాక్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఆర్టీ సీ చార్జీలను పెంచుతూ టీజీఆర్టీసీ నగరవాసులకు షాకిచ్చింది. గ్రేటర్ హైదరాబా ద్, సికింద్రాబాద్ పరిధిలో సేవలందిస్తున్న సిటీ బస్సుల చార్జీలను గణనీయం గా పెంచుతూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పెంచిన ఈ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో నిత్యం బస్సుల్లో ప్రయాణించే లక్షలాది మందిపై అదనపు ఆర్థికభారం పడనుంది.
ఆర్టీసీ తాజా నిర్ణయం ప్రకారం, సిటీ బస్సు సర్వీసుల్లో ప్రయాణించే స్టేజీల ఆధారంగా ఛార్జీల పెంపు వర్తిస్తుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ ఈ సర్వీసుల్లో మొదటి మూడు స్టేజీల వరకు టికెట్‌పై రూ.5 అదనపు భారం పడనుంది. నాలుగో స్టేజీ నుంచి ఆపై స్టేజీలకు రూ.10 అదనంగా వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.
అదేవిధంగా, మెట్రో డీలక్స్, ఈ ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5 పెంచగా, రెండో స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీల పెంపుతో నగరంలో ప్రతిరోజూ బస్సుల్లో ప్రయాణించే లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులపై నేరుగా ప్రభావం చూపనుంది. పండుగ సీజన్ ముగియగానే ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.