22-09-2025 05:17:48 PM
తొలి రోజు బ్రాహ్మీ అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): కరీంనగర్ మండలం నగునూర్‌లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ ఆలయంలో సోమవారం దుర్గాభవానీ శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమైనాయి. తొలిరోజైనా సోమవారం దుర్గాభవానీ అమ్మవారు బ్రాహ్మీ అలంకరణలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు, ఆలయ ప్రధానార్చకులు పవనకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చి పూజలు నిర్వహించారు. కలశస్థాపన, చతుషష్ఠ్యుపచార పూజ, చండీహోమం కన్యాసువాసినీ పూజలు జరిగాయి.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని చీరేసారే పెట్టి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. చండీహోమం నిర్వహించి అమ్మవారికి గంగా హారతులిచ్చారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, అన్నప్రసాద ట్రస్టు బాధ్యులు పల్లెర్ల శ్రీనివాస్, రాచమల్ల ప్రసాద్, తొడుపునూరి వేణుగోపాల్, చీకటిమల్ల అశోక్‌కుమార్, రాచమల్ల శ్రీనివాస్, రమేష్, పడకంటి వినోద్, అంజనేయులు భక్తులు పాల్గోన్నారు.