09-12-2024 12:08:10 AM
నితీశ్ మినహా..
అడిలైడ్ పిచ్‌పై అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో రోహిత్ సేన పూర్తిగా విఫలమైన చోట ఆసీస్ తనకు అచ్చొచ్చిన పేస్ బలగంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. పెర్త్ టెస్టులో ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసిన మన పేసర్లు అడిలైడ్‌లో మాత్రం అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయారు. ఇక బ్యాటర్ల సంగతి సరేసరి. తొలి టెస్టులో సెంచరీలతో అదరగొట్టిన జైస్వాల్, కోహ్లీ నిరాశపరచగా.. జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి ఘోర ప్రదర్శన చేశాడు. రాహుల్, గిల్ , పంత్ కూడా ఆకట్టుకోలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో భారత్‌కు మేలు జరిగింది ఏదైనా ఉందంటే అది నితీశ్ కుమార్ రెడ్డి విషయంలోనే. తొలి ఇన్నింగ్స్‌లో తన బ్యాటింగ్‌తో మెప్పించిన హైదరాబాదీ ఆల్‌రౌండర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 42 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి కాపాడాడు. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ మూడో స్థానానికి పడిపోగా.. ఆసీస్ టాప్‌లోకి దూసుకొచ్చింది.
అడిలైన్: పింక్ బాల్ టెస్టు (డై/నైట్) మనకు మరోసారి కలిసిరాలేదు. గత పర్యటనలో ఇదే అడిలైడ్‌లో (36 పరుగులు ఆలౌట్) ఘోర ఓటమిని మూటగట్టుకున్న భారత జట్టు మరోసారి చేదు ఫలితాన్నే రుచి చూసింది. బోర్డర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భార త్ 175 పరుగులకే పరిమితం కావడంతో 19 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 1 సమం చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. 128/5 క్రితం రోజు స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు. మ్యాచ్ ఆరంభంలోనే పంత్ (28) అదే స్కోరు వద్ద స్టార్క్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎంతో సేపు సాగలేదు. కెప్టెన్ కమిన్స్ 5 వికెట్లు.. బోలండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు.