10-12-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: స్వదేశంలో శ్రీలంకతో జరిగిన బధిరుల వన్డే సిరీస్‌ను భారత్ 5 క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం శ్రీలంక జట్టును 48.4 ఓవర్ల లో 276 పరుగులకు కట్టడి చేసి ఉత్క ంఠ గెలుపును అందుకుంది. భారత బౌలర్ సాయి ఆకాశ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ నెగ్గగా.. శ్రీలంక బౌలర్ అలన్‌రోస్ కాలెప్ (12 వికెట్లు) ‘ప్లేయర్ ఆప్ ది సిరీస్’, ‘బెస్ట్ బ్యాటర్ ఆఫ్ సిరీస్’ అవార్డును భారత బ్యాటర్ సంతోష్ కుమార్ (325 పరుగులు) కైవసం చేసుకున్నాడు.