10 April, 2026 | 1:36 PM

2 కోట్ల పెట్టుబడులతో పరార్

29-06-2024 12:03 AM

ఎక్స్‌సీఎస్‌పీఎల్ కంపెనీ పేరుతో మోసం

నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన ఈవోడబ్ల్యూ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): నగరంలో మరో మోసం వెలుగుచూసింది. ఎక్స్ పేరుతో కస్టమర్ల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టించి ఓ  కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జీటో కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎక్స్‌సీఎస్‌పీఎల్) పేరుతో 2015లో బెంగుళూరులో కంపెనీ ప్రారంభించారు. కంపెనీకి డైరెక్టర్లుగా బీఎన్ సతీశ్, అవలకొండప్ప వెంకటచలపతిలు ఉన్నారు. అనంతరం గదిరాజు రాజేంద్రప్రసాద్‌రాజు, గదిరాజు గురుప్రసాద్‌రాజు, పాసం వెంకట్‌ప్రసాద్, బైరెడ్డి జ్యోతితో రహస్య ఒప్పందం కుదుర్చుకొని నగరంలోని కూకట్‌పల్లిలో బ్రాంచ్‌ను ఓపెన్ చేసి www.xcspl.com పేరుతో వెబ్‌సైట్ రూపొందించింది.

ఈ క్రమంలో పెట్టిన పెట్టుబడులకు 3 నెలలకు 1:1, ఒక సంవత్సరలంలో 1:4 పద్ధతిలో రిటర్న్‌లు ఇస్తామని కస్టమర్లను నమ్మించి, అందుకోసం ఉద్యోగులను నియామించు కుంది. పెట్టుబడులకు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లిస్తామని సుమారు 150 నుంచి 200 వరకు మందిని మోసం చేసి రూ. 2 కోట్ల వరకు పెట్టుబడులను పొందారు. పెట్టుబడులకు సమానంగా కస్టమర్లకు ఎక్స్ అందజేశారు. జీటో కన్సల్టెన్సీ 9000250002 యూపీఐ ఐడీతో పలుమార్లు డబ్బులు చెల్లించామని, వచ్చిన రిటర్న్‌లను మూడు నెలల తర్వాత విత్‌డ్రా చేసుకొవచ్చని కంపెనీ ఐడీ, పాస్‌వర్డ్‌లను కస్టమర్లకు అందజేసిందని ఒక బాధితుడు తెలిపాడు.

మూడు నెలల సమ యం ముగిసిన తర్వాత డబ్బులు డ్రా చేద్దామని ప్రయత్నిస్తే యూపీఐ ఐడీ సపోర్ట్ చేయలేదని, దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మంజీరా ట్రినిటీ మాల్‌లోని 11వ అంతస్థులో గల కార్యాలయానికి వెళ్లగా మూసివేసినట్లు తెలిసింది.  టీ రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కంపెనీకి ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా ఉన్న ఏపీ కడప జిల్లా రాజంపేటకు చెందిన గురుప్రసాద్‌రాజు (32)ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.