సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత పీవీదే
29-06-2024 12:14 AM
సీఎం రేవంత్‌రెడ్డి నివాళి
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగ తిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం పీవీ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో పీవీ చిత్రపటానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం గా.. కేంద్రంలో వివిధ శాఖలకు మంత్రిగా, ప్రధాన మంత్రిగా పీవీ చేసిన సేవలు మరవలేనివన్నారు.




