calender_icon.png 29 July, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు

28-07-2025 07:57:52 PM

మహబూబ్ నగర్ టౌన్: ఫస్ట్ శిక్షణ సెంటర్ నందు ఇన్ఫోసిస్ సహకారంతో 190 నిరుద్యోగ యువతకు మొదటి బ్యాచ్ గా సాఫ్ట్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ లలో ఉచితంగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు.  గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) తన సొంత నిధులతో ఇప్పటికే మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణా కేంద్రంలో ఉచితంగా బ్యూటీషన్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్  కోర్సుల్లో  ఉచితంగా మహిళా అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నారు.  రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల భాషపైన అభ్యర్థులు పట్టు సాధించేందుకు నూతనంగా సోమవారం నుంచి సాఫ్ట్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభించినట్లు  చెప్పారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఫస్ట్ ఇంచార్జీ నిజలింగప్ప, సెట్విన్ విజయ్ కుమార్, ఇన్ఫోసిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.