28-07-2025 08:26:06 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి (విజయక్రాంతి): ప్రజా పాలనలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో తుంగతుర్తి మండలంలోని సుమారు 329 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ, నూతనంగా1233 రేషన్ కార్డు, అదనపు కార్డులు 1380 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం, రైతు రుణమాఫీ రైతు భరోసా సన్న బియ్యం పంపిణీ రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వైద్యం కోసం పేదలకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పథకాలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. గత పాలకుల కాలంలో ఇల్లు ఇస్తామని మోసాలు చేశారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో 1400 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వెలుగు పెళ్లి వద్ద రైతుల ప్రయోజనాల దుష్ట గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తుంగతుర్తి నుండి రావులపల్లి వరకు, కోడూరు కొమ్మల సంగం మీదుగా నూతనకల్ వరకు బీటీ రోడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. నూతన రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు, 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి వస్తున్నందున, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలని కోరారు. రానున్న సంస్థ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ప్రతి కార్యకర్త నాయకులు కష్టపడి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ తాసిల్దార్ దయానంద్ ఎంపీడీవో శేషు హౌసింగ్ అధికారులు వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షుల తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, సుంకర జనార్ధన్ మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, ఎల్సోజి నరేష్, రేగటి రవి, రేగటి వెంకటేష్, సంకినేని రమేష్ దాయం ఝాన్సీ రెడ్డి, నల్లు. రామచంద్రారెడ్డి, కలకోట్ల మల్లేష్ ,దాసరి శ్రీను, పెద్ద బోయిన అజయ్, మాచర్ల అనిల్ కొండా రాజు తడకమళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.