calender_icon.png 29 July, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే విద్యార్థులకు అందుబాటులో టాయిలెట్లు

28-07-2025 08:28:16 PM

రోటరీ గవర్నర్ హనుమంత్ రెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టాయిలెట్లు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నట్లు రోటరీ గవర్నర్ హనుమంత్ రెడ్డి(Rotary Governor Hanumanth Reddy) తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించతలపెట్టిన టాయిలెట్ బ్లాక్ ల నిర్మాణాన్ని రోటరీ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ హన్మంత రెడ్డి  సందర్శించారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి, కామారెడ్డి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శంకర్, సెక్రెటరీ కృష్ణహరి లతో కలిసి స్కూల్ ను సందర్శించారు. 

పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి సమక్షంలో తాపీ మేస్త్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ సేవా కార్యక్రమాలలో భాగంగా, రోటరీ సహకారం తో జరుగుతున్న ఈ  నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని రోజుల్లోనే పని పూర్తవుతుందని, విద్యార్థులకు టాయిలెట్లు అందుబాటులో రావడం వల్ల మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వారు తెలియజేసారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.