calender_icon.png 29 July, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

28-07-2025 08:01:10 PM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

ట్రాక్టర్ ఇసుక రవాణకు 1500 కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలి.

మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని రెసిడెన్షియల్ స్కూల్స్ లను రెగ్యులర్ గా తనిఖీ చేయాలి.

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెరగాలని, ప్రతి మండలంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండ్ అయ్యే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ(District Collector Sandeep Kumar Jha) అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మండలాల వారిగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, మార్కింగ్ చేసిన ఇండ్లు, నిర్మాణం జరుగుతున్న ఇండ్లు, వాటి పురోగతి వివరాలను మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం 8 వేల 811 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా,  5011 ఇండ్ల మార్కింగ్ జరిగిందని, 1485 ఇండ్లు బేస్మెంట్ స్థాయికి, 122 గోడల దశ వరకు, 50 ఇండ్లు రూఫ్ వరకు నిర్మాణం జరిగాయని తెలిపారు. శ్రావణ మాసంలో పెండింగ్ ఇండ్ల మార్కింగ్ పనులు కూడా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు నియంత్రణలో ఉండేలా మండల స్థాయి కమిటీ పని చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్ లో సర్వే వివరాల నమోదు రెండు రోజులలో పూర్తి చేయాలని ప్రతి మండలంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యే విధంగా అధికారులు లబ్ధిదారులతో చర్చలు జరపాలని కలెక్టర్ తెలిపారు. నగదు సమస్య ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించేందుకు కార్యచరణ చేపట్టాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూ ఆన్ లైన్ లో నమోదు చేయాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ తరఫు నుంచి ఆర్థిక సహాయం సకాలంలో అందేలా అధికారులు చూడాలని, మన దగ్గర పెండింగ్ ఉండకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. 

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, ఇసుక తీసుకెళ్ళెందుకు కూలీ, రవాణా చార్జీలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని, జిల్లాలో ఎక్కడైనా 1500 కంటే ఎక్కువ ట్రాక్టర్ ఇసుక సరఫరా కోసం వసూలు చేస్తే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోనే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, మోడల్ స్కూల్స్ లను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యా సంస్థల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉన్నాయా, నీరు నిల్వ ఉంటుందా, విద్యార్థులకు అందించే ఆహార, త్రాగునీటి నాణ్యత, ఎలా ఉంది వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఈ సమావేశంలో పిడి హౌసింగ్ శంకర్ రెడ్డి మండల ప్రత్యేక అధికారులు తహసిల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.