30-01-2026 12:10:54 AM
ఈసీఐఎల్లో నెల రోజుల శిక్షణ
కుషాయిగూడ, జనవరి 29 (విజయక్రాంతి) : ఈసీఐఎల్ ఎస్సి, ఎస్టి ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు విజయ్కుమార్, శ్రీనివాసరావు, శ్రీకాంత్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు నెల రోజుల పాటు ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, ఎస్బీఐ బ్యాంకు పక్కన, ఎన్‌ఎఫ్సీ రోడ్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్లో జరగనుందని పేర్కొన్నారు.
ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులకు విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు హాజరుకావచ్చని తెలిపారు. మాట్లాడే ఇంగ్లీష్ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఇది మంచి అవకాశమని వారు సూచించారు. మరిన్ని వివరాల కోసం 7842419367, 9851754975, 9866540814 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.