పోచమ్మకు పారిజాత నర్సింహారెడ్డి పూజలు
07-08-2026 12:07 AM
బడంగ్‌పేట్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ డివిజన్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, నాయకులు జైహింద్, జంగయ్య, డివిజన్ అధ్యక్షుడు శ్రీరాములు, శశిధర్ రెడ్డి, నరహరి గౌడ్, కృష్ణంరాజు గౌడ్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.






