7 August, 2026 | 12:58 AM

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

07-08-2026 12:05 AM

కూకట్‌పల్లి, ఆగస్టు 6 (విజయక్రాంతి): బోనాల పండుగను పురస్కరించుకొని బాలాజీ నగర్, మూసాపేట్ డివిజన్ ల పరిదిలోని అమ్మవారి ఆలయాలలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

బోనాల పండుగ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన బోనాల పండుగలో ఆచరించే నియమాలలో ఆరోగ్య పరిరక్షణ అంశాలు ఎన్నో దాగి ఉన్నాయి అన్నారు. ఈ కాలంలో వైరస్ వల్ల వచ్చే రోగాలను అరికట్టే లక్షణాలు అమ్మవారికి సమర్పించే పసుపు, కుంకుమ, ధూప దీప నైవేద్యాలలో దాగి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రంగారావు, తూము శ్రావణ్, పగుడాల బాబురావు, బి ఆర్ ఎస్ నాయకులు తులసిరావు, వెంకటేష్, బొట్టు విష్ణు, శ్రీనివాస్, ఆరోగ్య రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.