22-10-2025 12:00:00 AM
- తెర వెనుక చక్రం తిప్పుతున్న రాజకీయ నేతలు
-పాత పంచాయతీ లే అవుట్ల పైనే కన్ను
-కబ్జాలపై ఫిర్యాదులు చేసిన స్పందించని అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్21: ప్రభుత్వ స్థలాలు, ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన పార్కు స్థలాలు కబ్జాలకు గురవుతున్న సంబంధిత అధికారులు స్పందించడం లేదు. కళ్ళముందరనే కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాలు, ప్రజాప్రయోజనాల కోసం స్థలాలు అక్రమాల చెర బడుతున్న తమకు సంబంధం లేనట్టుగా అధికారులు వివరిస్తున్న తీరు పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా జీపీ లో పాత లేవట్ల కింద 10 శాతం కింద ప్రజా ప్రయోజనాల కింద వదిలిన స్థలాలే అన్యకాంతం అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్ళితే... రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో జన చైతన్య పేరుతో జీపీ లే అవుట్ చేశారు. ఇందులో ప్రజాప్రయోజనాలకు కోసం వదిలిన పార్కు స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేసి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దీన్ని విలువ సుమారు రూ.5 కోట్లపైనే ఉంటుంంది. కబ్జా వ్యవహరంపై మున్సిపల్ కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదులు చేసినా.. స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మీ తతంగం వెనక తెర వెనుక స్థానిక రాజకీయ నాయకులు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2001లో జీపీ లే అవుట్
జనచైతన్య హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద అంబర్‌పేట్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 153, 168 లలో 3.20 ఎకరాలలో గ్రామ పంచాయతీ లే అవుట్ చేశారు. ఇందులో 35%ఇ/ఆ,36ఇ/ఆ.35జూ/ఆ, 36జూ/ఆ% ఈ నెంబర్ల ప్లాట్లకు కేటాయించలేదు. ఈ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం పార్కుకు వదిలిపెట్టారు. లే అవుట్ మొత్తం స్థలం 14,520 గజాలు, పాట్లు 8,487 గజాలు, రోడ్డు 4787 గజాలు, ఓనర్ల 82 గజాలు, ఓపెన్ స్థలం 817 గజాలున్నట్లు లే అవుట్‌లో పొందుపరిచారు.
ఓపెన్ స్థలం, పార్కు స్థలాలు మొత్తం కలిసి దాదాపు 1100 గజాలు విలువ సుమారు రూ.5కోట్ల స్థలాన్ని గత భూ యజమాన్యాలు ఆకుల స్వప్ప, ఆకుల బాలమణి, ఆకుల శ్రీలత పట్టాదారు పాసుబుక్కులతో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా గత భూ యాజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. డాక్యుమెంట్ల నెంబర్ (2086/2025 ఆకుల స్వప్న), (2085/2025 ఆకుల బాలమణి), (2088/2025 ఆకుల లతశ్రీ) గత మార్చి%--%2025 ప్లాట్ నెంబర్ 40 చూపిస్తూ.. సబ్‌రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అసలు ఈ లే అవుట్ ప్లాట్ నెంబర్ 40 లేదు.
సమాచారం ఇచ్చిన రిజిస్ట్రేషన్లు
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో జన చైతన్య హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ జీపీ లే అవుట్‌లోని పార్కు స్థలం కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశాలున్నాయని పెద్ద అంబర్‌పేట్ సబ్%--%రిజిస్టార్‌కు స్థానికులు ముందుస్తుగానే సమాచారం ఇచ్చినప్పటికీ... సబ్ రిజిస్టార్ ఎలా రిజిస్ట్రషన్లు చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను, పార్కు స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులకు లేదా అధికారులు ఎవ్వరి కోసం పని చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లతో అధికారులు కుమ్మకై పార్కు, చెరువు, కుంట ఇలా ఏ స్థలం అయితే ఆ స్థలం రిజిస్ట్రేషన్లు చేసుకుంటే పోతే చివరి ఏమీ మిగలదు.
అధికారులు మొద్దు నిద్ర వీడాలి
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో జన చైతన్య హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ జీపీ లే అవుట్ చేసిండ్రు. ప్రజాప్రయోజనాల కోసం వదిలిన ఓపెన్ స్థలం, పార్కు స్థలం కబ్జా చేసి.. పాత పత్రాలను చూపించి రిజిస్ట్రేషన్లు చేసుకుండ్రు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాం. సంబంధిత అధికారులు మొద్ద నిద్ర వీడి కబ్జాకు గురువుతున్న పార్కు స్థలాలను, ప్రభుత్వ స్థలాలను కాపాడాలె.
పోరెడ్డి జగన్ రెడ్డి, పెద్ద అంబర్‌పేట్ వాసి