20 April, 2026 | 7:46 PM

మళ్లీ విధుల్లోకి పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు

07-06-2025 12:00 AM

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేసే పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, హెల్పర్లు, ఆయాలను కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ నర్సింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.