calender_icon.png 7 July, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి

05-07-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 4 (విజయ క్రాంతి):మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి అన్నారు. శుక్రవారం  మెడికల్ కళాశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్ర మంలో భాగంగా కాలేజీ ప్రిన్సిపల్ తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాతావరణాన్ని అందించేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు వనమహోత్సవంలో భాగస్వాములై మొక్క లు నాటి వాటిని సంరక్షించుకోవాలని   కోరారు .

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కాలుష్యా న్ని నియంత్రించేందుకు చెట్లను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సతీష్, సూపర్టెండేట్ పాషా, శ్యాంబాబు, సుమంత్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ లలిత, ఏపీవో బుచ్చన్న ,వైద్య విద్యార్థులు, మెడికల్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.